![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -403 లో....నర్మద, సాగర్ ఇద్దరు శ్రీనివాసరావు ఇంటికి వెళ్తారు. నర్మద కోపంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. మీరే వచ్చారా నేనే వద్దామని అనుకున్న అల్లుడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను పూర్తిగా అతన్ని అల్లుడిగా ఒప్పుకుంటున్నాను.. ఈ రోజు పార్టీ ఇచ్చి అందరికి పరిచయం చేయాలనుకుంటున్నానని అతను అంటాడు. ఏమని పరిచయం చేస్తావ్ నాన్న.. నా అల్లుడికి ఇరవై అయిదు లక్షలు లంచం ఇచ్చి జాబ్ ఇప్పించానని చెప్తావా అని నర్మద అనగానే వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. మీరు పెద్దవారు ఇలాంటి పనులు చెయ్యొచ్చా.. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని నర్మద కోప్పడుతుంది.
అల్లుడికి జాబ్ చెయ్యాలని ఉంది. నేను సాయం చేసానని శ్రీనివాసరావు అంటాడు. అవన్నీ ఎవరికి తెలియవు.. సాయంత్రం పార్టీ ఇస్తున్న ఫ్యామిలీతో రావాలని అతను అనగానే మీకు నచ్చింది చేసుకోండి అని నర్మద కోపంగా వెళ్ళిపోతుంది. మావయ్య మీరు పార్టీకి అన్ని సిద్ధం చెయ్యండి నేను ఒప్పించి తీసుకొని వస్తానని వాళ్ళ మావయ్యతో సాగర్ చెప్తాడు. మరొకవైపు వేదవతి మొక్కలకు నీళ్లు పోస్తుంటే అమూల్య పిలుస్తుంది. వేదవతి కోపంగా అమూల్యపై వాటర్ పోసి లోపలికి వెళ్ళిపోతుంది. ధీరజ్ కోసం ప్రేమ టీ పెడుతుంది. వేదవతి వెళ్లి కోపంగా అది తాగుతుంది. మరొకవైపు ప్రేమ అన్న మాటలు ధీరజ్ గుర్తుచేసుకుంటాడు. నీకు నచ్చిన ఫీల్డ్ లో సక్సెస్ అవ్వమని ప్రేమ అన్న మాటకి తన దగ్గరున్న డబ్బు తీసుకొని ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ప్రేమ, వేదవతి కిచెన్ లో ఉంటారు. బయటకు వెళదాంరా అని ధీరజ్ అనగానే నీకోసం టీ పెట్టాను.. తాగితే వస్తానని ప్రేమ అనగానే ధీరజ్ తాగుతాడు. ప్రేమని తీసుకొని ధీరజ్ వెళ్తుంటే చలికి వణుకుతు అమూల్య ఉంటుంది. వెంటనే ధీరజ్ తన దగ్గరికి వెళ్లి అమ్మకి మనమంటే ఎప్పుడు ప్రేమనే ఉంటుంది. నువ్వు ఏం పట్టించుకోకని ప్రేమగా మాట్లాడతాడు.
చాలా థాంక్స్ అన్నయ్య.. నాతో ఎవరు మాట్లాడరు అనుకున్న నువ్వు మాట్లాడావని అమూల్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు బ్రోకర్ కి సాగర్ కి సంబంధం ఏంటని కనుక్కోవడానికి బ్రోకర్ దగ్గరికి భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి మారువేషంలో వెళ్తారు. మా నాన్నకి జాబ్ కావాలి.. ఎలాగైనా ఇప్పించాలని శ్రీవల్లి అతన్ని అడుగుతుంది. శ్రీవల్లిని చూసి ఫ్లాట్ అయి సరే అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |